Pages

Monday, May 2, 2011

Faith in the Bible Verses-Telugu

విశ్వాసము గురించి పరిశుధ్ధ గ్రంధం వివరించిన సంగతులు
(Faith in The Bible)
ఆదికాండము 15 :5 అబ్రాహాముకు దేవుని పై ఉన్న విశ్వాసము మరియు ఆయన (దేవుడు) వెలుపలికి అతని (అబ్రాహామును) తీసుకొనివచ్చి - నీవు ఆకాశము వైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి- నీ సంతానము ఆలాగవునని చెప్పెను. అబ్రహాము దేవుని నమ్మెను

దేవుడు అబ్రహామును తన కుమారుని బలి ఇమ్మన్నప్పుడు కూడా అబ్రహాము చలించలేదు
ఆదికాండము 22 :8 అబ్రాహాము - నా కుమారుడా, దేవుడే దహనబలికి గొఱ్ఱెపిల్లను చూచుకొనునని చెప్పెను.
అపోస్తలుడైన పౌలు గలతీయులకు వ్రాసిన పత్రికలో  3:6 అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా యెంచబడెను.


యోసేపు చనిపోతున్నప్పుడు తన కుమారులతో చెప్పిన మాటలలో యోసేపుకున్న విశ్వాసము
ఆదికాండము  50:25 మరియు యోసేపు - దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును; అప్పుడు మీరు నా యెముకలను ఇక్కడినుండి తీసికొనిపోవలనని చెప్పి ఇశ్రాయేలు కుమారులచేత ప్రమాణము చేయించుకొనెను.
మోషేకు దేవుడు ఎవరో తెలియనప్పుడు దేవుడు చెప్పిన పనిని చేసిన విషయములో మోషేకున్న విశ్వాసము
నిర్గమకాండము 4:4 అపుడు యెహోవా- నీ చెయ్యి చాపి దాని తోకపట్టుకొనుమనుగా, అతడు చెయ్యి చాపి దాని పట్టుకొనగానే అది అతని చేతిలోకఱ్ఱ ఆయెను.

ఇదే విషయాన్ని యేసు ఇశ్రాయేలీయుల పెద్దలతో అన్నారు
యోహాను 3 :14 అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో, అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను.


దానియేలును రాజు శిక్షించడానికి ఉద్యుక్తడైనపుడు
దానియేలు 3: 17 మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల యీ అగ్ని గుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్ధుడు. మరియు నీ వశమున పడకుండ ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసికొనుము.


దానియేలు 3:27 అధిపతులును సేనాధిపతులును సంస్థానధిపతులును రాజుయొక్క ప్రధాన మంత్రులును కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి, వారి శరీరములకు అగ్ని యే హానియుకుండుటయు, వారి తలవెండ్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనయైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి.

దానియేలు 3:28 నెబుకద్నెజరు-షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు; ఆయన దూతనంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి యే దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్ధపరిచిరి.

దానియేలు 3:29 కాగా నేనొక శాసనము నియమించుచున్నాను; ఏదనగా, ఇవ్విధముగ రక్షించుటకు సమర్ధుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు.


దానియేలు 6:22 నేను నా దేవుని దృష్టికి నిర్ధోషినిగా కనపడితిని గనుక ఆయన తన దూత నంపించి, సింహములు నాకు ఏ హానియు చేయకుండ వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసినవాడను కాను గదా అనెను.


హబక్కూకు 2:4 వారు యధార్ధపరులు కాక తమలో తాము అతిశయపడుదురు; అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రదుకును.

గ్రుడ్డివాడు యేసు వెళ్ళుచున్నాడని తెలుసుకొని తనను తప్పక యేసు బాగుచేయగలడని విశ్వసించాడు
లూకా 18:39 ఊరకుండుమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి గాని, వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేసెను.

యోహాను 20:29 యేసు-నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను.

1 కొరింధీ 10:9 మనము ప్రభువును శోధింపక యుందము; వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి.

1 కొరింధీ 10:10 మీరు సణుగకుడి; వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి

పౌలు గలతీయులతో 2 :20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను.

గలతీ 3 :11 ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని యెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే - ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును.

గలతీ 3:24 కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడునట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను.


గలతీ 3:25 అయితే విశ్వాసము వెల్లడియాయెను గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము.
అపోస్తులుడైన పౌలు యొక్క విశ్వాసము
ఫిలిప్పీ 4:13 నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను

1 థెస్స 1: 8 అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవునియెడల ఉన్న మా విశ్వాసము వెల్లడాయెను గనుక, మేమేమియు చెప్పవలసిన ఆవశ్యము లేదు.

1 తిమోతి 6: 12 విశ్వాస సంభంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి నేక సాక్షులయెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి.

హెబ్రీ 11:1 విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువనైయున్నది.

హెబ్రీ 11:4 విశ్వాసమును బట్టి హేబెలు కయీనుకంటె శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినపుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతి మంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతిబొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు

హెబ్రీ 11: 5 విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను.; అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టుడైయుండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు.

హెబ్రీ 11: 6 విశ్వాసము లేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయనయున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.

యాకోబు 2:24 మనుష్యుడు విశ్వాసమూలమున మాత్రముకాక క్రియల మూలమునను నీతిమంతుడని యెంచబడునని, మీరు దీనివలన గ్రహించితిరి.


యాకోబు 2: 26 ప్రాణములేని శరీరమేలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము.

దేవుడు ప్రవక్తయైన యెషయా ద్వారా మనలను అడుగుచున్నాడు
 

యెషయా 50:2 నేను వచ్చినపుడు ఎవడును లేకపోనేల ? నేను పిలిచినపుడు ఎవడును ఉత్తరమియ్యకుండనేల? నా చెయ్యి విమోచింపలేనంత కురచయైపోయెనా? విడిపించుటకు నాకు శక్తి లేదా?
ప్రభువైన క్రీస్తు ద్వారా మీకు రక్షణ, సమాధానము కలుగును గాక.  Amen.



No comments: