Pages

Tuesday, May 3, 2011

Whether God is there or not- Telugu

దేవుడున్నాడా? లేడా?


జీవాధిపతియైన క్రీస్తునందున్న సహోదరులకు శుభములు. చాలా కాలంనుండి చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. ఆఖరుకు క్రైస్తవులకు కూడా అప్పుడప్పుడు ఉద్భవించే ప్రశ్న. క్రైస్తవులకు అటువంటి సందేహము ఉండకూడదా?. ఉండకూడదు ఎందుకంటె క్రైస్తవజీవితానికి ముఖ్యమైనది విశ్వాసమే. యేసుక్రీస్తు తోమాతో " అవిశ్వాసివి కాక విశ్వాసివైయుండుము" అని చెబుతూ "నీవు చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులు" (యోహాను 20:20) అని హెచ్చరిస్తారు. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా హెబ్రీయులకు వ్రాస్తూ "విశ్వాసమనునది అదృశ్యమైనవియున్నవనుటకు రుజువునైయున్నది" (హెబ్రీ 11 :1)అని తెలియజేసాడు. దేవుడు లేడేమో అని సందేహిస్తూ ఆరాధించవద్దు. దేవుడు ఉంటే ఎవరికైనా కనిపించాడా అని కొంతమంది సందేహాన్ని వెలిబుచ్చి తెలివైన వాళ్ళమనుకుంటారు. కూరలో ఉప్పు ఉందని మనకు రుచిని బట్టి తెలుస్తుంది. కాని అందులో ఉన్న ఉప్పును ఎవరు చూపలేరు. దాని చూపాలంటె కూరలో మరిన్ని నీళ్ళు వేసి ముక్కలు వడకట్టి, ఆ నీళ్ళు ఇగిరి పోయేంత వరకు మరిగించి, ఆవిరి పట్టి, దానిని మరల చల్లార్చి, మరల ఆ నీళ్ళను మరగ పెడితే వేసిన ఉప్పు అనవాలును మాత్రం చూపగలం. అందుకే " యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి" అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని చూడాలనుకునేవారు ముందు దేవుని గురించిన ఆసక్తి దేవుడున్నాడన్న నమ్మకం, పాపభీతి, ముఖ్యంగా ఓర్పును కలిగి ఉండాలి. అలాగే గాలిని మనం పీలుస్తున్నాం, చల్లగా ఉందనో , వేడిగా ఉందనో అంటున్నాం. దానియొక్క ఉనికిని మనం అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోగలం. ఒకే గదిలో ఉన్న ఇద్దరు మనుష్యలకు ఆ గదిలో ఉన్న గాలి ఒకరికి చలి గాను మరొకరికి అనువుగాను ఉండవచ్చు కాబట్టి మనం ఇద్దరికి కలిగిన అనుభవాన్ని విని మనం అనుభవించాలి. గాలిని మనం చూడలేం గాలికి గల లక్షణాలను మన శాస్త్రజ్ఞులు వ్రాస్తే వాటిని మనం చదివి గాలికి గల గుణగణాలను ఆస్వాదించగలుగుతున్నాం. అలాగే దేవుని యొక్క ఉనికిని పరిశుద్ధగ్రంధం వివరిస్తుంది, దానిని ఆసక్తితో చదివితే దేవుని యొక్క ఆత్మ మనకు అర్ధంకాని ఎన్నో విషయాలను వివరిస్తుంది, దాని ద్వారా మనం దేవుని తెలుసుకోగలుగతాం. "నపుంసకుడు తన రధము మీద కూర్చుండి ప్రవక్తయైన యెషయా గ్రంధము చదువుచున్నప్పుడు ఆత్మ ఫిలిప్పుతో –నీవు ఆ రధము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పి పంపించెను" (అ.కా 8:29). మనం జీవించి ఉన్నాం అంటే మనలో జీవం ఉంది మరి దానిని ఎవరైనా చూసారా లేదు అయినా జీవం అనేది ఉందని నమ్ముతున్నాం. "యేసు –నేనే మార్గమును, సత్యమును జీవమునైయున్నాను" (యోహాను 14: 6)అని మనతో చెప్పారు. అలాగే " క్రీస్తు మీలో నున్నయెడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది కాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగియున్నది" (రోమా 8:10). అటువంటి ఆత్మ మీలో ఉన్న యెడల మీ పొరుగువారు మీలో ఉన్న అందరికి ప్రభువైన క్రీస్తును చూడగలుగుతారు. అటువంటి ఆత్మను షూషనుకోట పాఠకులకు అందరికీ కలగాలని క్రీస్తు యొక్క సర్వోత్తమమైన నామమున పరలోకపు తండ్రిని వేడుకొనుచున్నాను. ఆమేన్.

1 comment:

Priscilla said...

Yes,that's true that Christianity comes through faith. Example related to salt is simply superb.Faith comes through truth and righteousness. As the Bible says in Psalms 100:5 - For the Lord is good, his mercy is everlasting,and his truth endureth to all generations.
Amen!!