Pages

Sunday, April 17, 2011

First sentance on croos యేసు క్రీస్తు సిలువపై పలికిన మొదటి మాట

ఆయన సిలువపై పలికిన 7 మాటలు ఎంత ప్రాముఖ్యమైనవో సహోదరులందరికీ తెలుసు.  అందులో  మొదటి మాట (లూకా 23:34) యేసు- తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఎక్కువమంది ఆయన అన్ని దెబ్బలు తిని వారిని క్షమించమని అడుగుతున్నారు అని వక్రీకరిస్తున్నారు. అలా అయితే ఆయన కొరడాలతో కొట్టినపుడు అనాలి గాని సిలువపైనే ఎందుకన్నారు ఒకసారి చూద్దాం.
ఇశ్రాయేలీయులు దేవునితో ప్రతీసారి మాటలాడడానికి భయబడి ఒక రాజును నియమించమని అడిగారు.
 అయినను మీ దుర్ధశలన్నిటిని ఉపద్రవములన్నిటిని పోగొట్టి మిమ్మును రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి - మా మీద ఒకని రాజుగా నియమింపుమని ఆయనను అడిగియున్నారు (సమూయేలు1- 10:19)
ఇది యేసు క్రీస్తు  పరలోకరాజ్యమును ద్రాక్షతోటను గుత్తకిచ్చి దేశాంతరము పోయిన యజమానితో పోల్చిన విధానం చూడండి. మత్తయి 21:33
లూకా 11:49  అందుచేత దేవుని జ్ఞానము చెప్పిన దేమనగా - నేను వారియొద్దకు ప్రవక్తలను అపొస్తలులును పంపుదును.వారిలో కొందరిని చంపదురు, కొందరిని హింసింతురు.

ఆ విధంగా తండ్రి యెరూషలేము అనే ద్రాక్షతోటలో ఇశ్రాయేలీయులు అనే ద్రాక్షపంటను తీసుకుందామని వచ్చిన ఆయన కుమారుని చంపిరి.
మత్తయి 21:38 అయినను ఆ కాపులు కుమారుని చూచి- ఇతడు వారసుడు; ఇతని చంపి ఇతని స్వాస్థ్యము తీసికొందము రండని తమలో తాము చెప్పుకొని అతని పట్టుకొని ద్రాక్షతోట వెలుపట పడవేసి చంపిరి.
యేసుక్రీస్తు ను సిలువ వేసింది యెరూషలేముకు వెలుపలే.

అ.కా 3 :14 మీరు పరిశుద్దుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి, నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి.

అ.కా 3:15 మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను; అందుకు మేము సాక్షులము.

అ.కా 3:17 మీరును మీ అధికారులును తెలియక జేసితిరని నాకు తెలియును

ఈ విషయం ప్రభువైన క్రీస్తుకు ముందుగా తెలుసు కాబట్టి  ఆయన తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని కోరుకున్నారు.

అ.కా 3:18 అయితే దేవుడు తన క్రీస్తు శ్రముపడునని సమస్త ప్రవక్తలనోట ముందుగా ప్రచురపరచిన విషయములను ఈలాగు నెరవేర్చెను.


అంతే కాకుండ ఆయన ఒక మాదిరిగా ఉండడానికి ఈ లోకంలోకి వచ్చారు కాబట్టి ఆయన చెప్పిన మాట ప్రకారం

మత్తయి 5:44 నేను మీతో చెప్పునదేమనగా మీ తండ్రికి కుమారులైయుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్ధన చేయుడి.


ఆయనను హింసించిన వారిని కూడా పూర్తిగా హింసించటం అయిపోయింతర్వాత ఆయన ఆ మాట పలికారు. ముందే ఈ మాట పలికుంటే ఆయన కొన్ని దెబ్బలు తిన్న తరువాత ఆ మాట అనగలిగారు, పూర్తిగా దెబ్బలు తింటే ఎవరూ ఆ మాట అనలేరు అని ముక్తాయించేవారు.

దేవుడు మిమ్మును దీవించుగాక.....................................................................................ప్రేమతో దయాళ్

No comments: