దేవుడున్నాడు (YES, GOD IS THERE)
ఇప్పటి వరకు కలిగిన కృపను బట్టి దేవునికి స్తోత్రము. సహోదరులకు వందనములు. గత పోస్ట్ లో దేవుడున్నాడా? లేడా ? చదివితే బహుశా చాలా మంది ఏకిభవించి ఉంటారు. ఒకవేళ మీరు ఏకిభవించని యెడల ఇంకా మంచిది ఎందుకంటె "అయిన నేమి మిషచేతనే గాని సత్యము చేతనే గాని, యే విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను. ఇక ముందును సంతోషింతును” (అపోస్తలు పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 1:18) అని పౌలు అంటున్నాడు. అంటె మీరు దేవుడు లేడు లేడు అంటూ ఉంటె దేవుడనే వాడు నిజంగా లేడా అని ప్రజలు ఆలోచించడం మొదలు పెడతారు.
వాళ్ళ అలోచన సరళి ఎలా మొదలౌతుంది అంటె
ఎదుటి వ్యక్తికి ఏక్సిడెంట్ అయ్యింది నాకెందుకు కాలేదు ?,
నేను స్కూటర్ వెళుతున్నాను కాబట్టి.
మరి స్కూటర్ పై వెళ్ళే వాళ్ళు చాలామంది ఏక్సిడెంట్ అయ్యింది కదా?
వాడు రాంగ్ రూట్ లో వెళ్ళాడేమో !
మరి హైవేలో సరియైన రూట్ లో వెళ్ళినా ఏక్సిడెంట్లు అవుతున్నాయి కదా ?
కరెక్టే, వాళ్ళకు అలా రాసిపెట్టి ఉందేమో! ( బైబిల్ చదివే వారికి వెంటనే “గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడును నేనే తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే. నేనే చేసియున్నాను. చంకపెట్టుకొనువాడను నేనే నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడనే నేనే” (యెషయా 46:3) అని పలికిన దేవుని మాటలు గుర్తుకు రావాలి). బైబిల్ చదవని వారికైతే ఇంకా ఇలా ఆలోచిస్తారు.
బండి నడుపుతున్న వ్యక్తి కి హార్ట్ ఎటాక్ వచ్చిందేమో !
మరి నాకెందుకు రాలేదు ?
అబ్బే నేను మాంసాహారం తక్కువ తింటాను సిగరెట్లు తాగను, మందు తాగను అందుకేనేమో !
మరి శాకాహారులు వందల సంవత్సరాలు బ్రతకాలి కదా, స్త్రీలు సిగరెట్లు గాని మందు గాని తాగరు మరి వాళ్ళు వందల సంవత్సరాలు బ్రతకాలి కదా ? ( ఇక స్వగతం గురించి కాక భూమి గురించి ఆలోచిద్దాం)
భూమి తన చుట్టు తాను తిరగుతూ సూర్యుని చుట్టు తిరుగుతుంది గదా అది ఎందుకు పడిపోవట్లేదు ?
బహుశా భూమ్యాకర్షణ శక్తి వలనేమో !
కాదు భూమ్యాకర్షణ శక్తి భూమి మీద ఉండెవాటికే కదా అందుకే కదా రాకెట్లు నుండి విడిపోయిన శకలాలు శూన్యంలో వేలాడుతుంటాయి.
“భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును యెహోవావే ఆయున సముద్రములమీద దానికి పునాది వేసెను, ప్రవాహజలముల మీద దాని స్థిరపరచెను” (కీర్తనలు 24:1)
ప్రియమైన నెటిజన్ సహోదరుడా పరిశుద్ద గ్రంధం భూమి సూర్యకుటుంబంలో ఒక గ్రహం అని నిరూపింపబడకముందే వ్రాయబడింది.
“ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది (కీర్తనలు 19:1) అని దావీదు మహారాజు “అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించును అకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించినయెడల అది నీకు బోధించును సముద్రములోని చేపలును నీకు దాని వివరించును వీటి అన్నిటిని బట్టి యోచించుకొనిన యెడల యెహోవా హస్తము వీటిని కలుగజేసెనని తెలిసికొనలేని వాడెవడు ?” (యోబు 12:7) అని ఏ శాస్త్రాలు లేనపుడే వివరించారు. మీరు కూడా ఆలోచించడం మొదలు పెట్టండి, ఆలోచించండి, మీ ఆలోచనలు ఏమో, కావచ్చేమో దగ్గర అంతం కానివ్వకండి. ఆ ఆలోచనా స్రవంతిని దేవుడే ఈ బ్లాగు ద్వారా మీకందరికీ అనుగ్రహించాలని మహిమాన్వితమైన క్రీస్తు నామములో వేడు కొంటున్నాను. మీ సందేహాలను పరిశుధ్ధ గ్రంధం చదవటం ద్వారానో, ప్రార్ధన ద్వారానో దేవుడు తీర్చును గాక ఆమెన్. (సమీక్ష చేయుటకు 9542223999 )