Pages

Sunday, April 17, 2011

First sentance on croos యేసు క్రీస్తు సిలువపై పలికిన మొదటి మాట

ఆయన సిలువపై పలికిన 7 మాటలు ఎంత ప్రాముఖ్యమైనవో సహోదరులందరికీ తెలుసు.  అందులో  మొదటి మాట (లూకా 23:34) యేసు- తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఎక్కువమంది ఆయన అన్ని దెబ్బలు తిని వారిని క్షమించమని అడుగుతున్నారు అని వక్రీకరిస్తున్నారు. అలా అయితే ఆయన కొరడాలతో కొట్టినపుడు అనాలి గాని సిలువపైనే ఎందుకన్నారు ఒకసారి చూద్దాం.
ఇశ్రాయేలీయులు దేవునితో ప్రతీసారి మాటలాడడానికి భయబడి ఒక రాజును నియమించమని అడిగారు.
 అయినను మీ దుర్ధశలన్నిటిని ఉపద్రవములన్నిటిని పోగొట్టి మిమ్మును రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి - మా మీద ఒకని రాజుగా నియమింపుమని ఆయనను అడిగియున్నారు (సమూయేలు1- 10:19)
ఇది యేసు క్రీస్తు  పరలోకరాజ్యమును ద్రాక్షతోటను గుత్తకిచ్చి దేశాంతరము పోయిన యజమానితో పోల్చిన విధానం చూడండి. మత్తయి 21:33
లూకా 11:49  అందుచేత దేవుని జ్ఞానము చెప్పిన దేమనగా - నేను వారియొద్దకు ప్రవక్తలను అపొస్తలులును పంపుదును.వారిలో కొందరిని చంపదురు, కొందరిని హింసింతురు.

ఆ విధంగా తండ్రి యెరూషలేము అనే ద్రాక్షతోటలో ఇశ్రాయేలీయులు అనే ద్రాక్షపంటను తీసుకుందామని వచ్చిన ఆయన కుమారుని చంపిరి.
మత్తయి 21:38 అయినను ఆ కాపులు కుమారుని చూచి- ఇతడు వారసుడు; ఇతని చంపి ఇతని స్వాస్థ్యము తీసికొందము రండని తమలో తాము చెప్పుకొని అతని పట్టుకొని ద్రాక్షతోట వెలుపట పడవేసి చంపిరి.
యేసుక్రీస్తు ను సిలువ వేసింది యెరూషలేముకు వెలుపలే.

అ.కా 3 :14 మీరు పరిశుద్దుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి, నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి.

అ.కా 3:15 మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను; అందుకు మేము సాక్షులము.

అ.కా 3:17 మీరును మీ అధికారులును తెలియక జేసితిరని నాకు తెలియును

ఈ విషయం ప్రభువైన క్రీస్తుకు ముందుగా తెలుసు కాబట్టి  ఆయన తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని కోరుకున్నారు.

అ.కా 3:18 అయితే దేవుడు తన క్రీస్తు శ్రముపడునని సమస్త ప్రవక్తలనోట ముందుగా ప్రచురపరచిన విషయములను ఈలాగు నెరవేర్చెను.


అంతే కాకుండ ఆయన ఒక మాదిరిగా ఉండడానికి ఈ లోకంలోకి వచ్చారు కాబట్టి ఆయన చెప్పిన మాట ప్రకారం

మత్తయి 5:44 నేను మీతో చెప్పునదేమనగా మీ తండ్రికి కుమారులైయుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్ధన చేయుడి.


ఆయనను హింసించిన వారిని కూడా పూర్తిగా హింసించటం అయిపోయింతర్వాత ఆయన ఆ మాట పలికారు. ముందే ఈ మాట పలికుంటే ఆయన కొన్ని దెబ్బలు తిన్న తరువాత ఆ మాట అనగలిగారు, పూర్తిగా దెబ్బలు తింటే ఎవరూ ఆ మాట అనలేరు అని ముక్తాయించేవారు.

దేవుడు మిమ్మును దీవించుగాక.....................................................................................ప్రేమతో దయాళ్

Saturday, April 16, 2011

bible study 1 ...! adi kandam

సంకల్పము ఆది 1 2 భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధజలము పైన కమ్మియుండెను.  దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.
నరులు ఆది 1 27 దేవడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వానిని సృజించెను; స్త్రీని గాను పురుషునిగాను వారిని సృజించెను.
నిత్యజీవము ఆది 1 28 దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా -మీరు ఫలించి అభివృద్ది పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి;  సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.
సృష్టి ఆది 1 31 దేవుడు తాను చేసినది యావత్తును చూచినపుడు అది చాలమంచిదిగ నుండెను.  అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవదినమాయెను.
జీవాత్మ ఆది 2 7 దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.
జీవ వృక్షము ఆది 2 9 మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోటమధ్యను జీవవృక్షమును, మంచిచెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేలనుండి మొలిపించెను.
భార్య ఆది 2 18 మరియు దేవడైన యెహోవా - నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదననుకొనెను.
భార్య ఆది 2 24 కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక  శరీరమైయుందురు.
మోసము ఆది 3 1 ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా
సాతాను ఆది 3 5 ఆయన ఆదాముతో- నీవు నీ భార్య మాట విని- తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు.
విత్తు ఆది 3 17 అది ముండ్లతుప్పలను, గచ్చపొదలను నీకు మొలిపించును.  పొలములోని పంట తిందువు.
జీవ వృక్షము ఆది 3 18 అప్పుడాయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను.
విత్తు ఆది 3 24 అప్పుడాయన- నీవు చేసిన పని యేమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలోనుండి నాకు మొరపెట్టుచున్నది.
పాపము ఆది 4 7 నీవు సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను.
విత్తు ఆది 4 12 నీవు నేలను సేద్యపరచునపుడు అది సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులుపడుచు దేశదిమ్మరివై యుందువనెను.
హానోకు ఆది 5 24 హనోకు దేవునితో నడచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను.
హృదయము ఆది 6 5 నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి
సంతాపము ఆది 6 6 తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను.
సేవకుడు ఆది 8 7 ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను.  అది బయటకి వెళ్ళి భూమి మీదనుండి నీళ్ళు ఇంకిపోవువరకు ఇటు అటు తిరుగుచుండెను.
సేవకుడు ఆది 8 8 మరియు నీళ్ళు నేలమీదనుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్దనుండి నల్లపావురమొకటి వెలుపలికి పోవిడిచెను.
సేవకుడు ఆది 8 9 నీళ్ళు భూమి అంతటి మీదనున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలో నున్న అతనియొద్దకు వచ్చెను. అప్పుడతడు చెయ్యిచాపి దాని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను.
ప్రాణము ఆది 9 4 అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు; రక్తమే దాని ప్రాణము.
ప్రాణము ఆది 9 5 మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును; దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును.
ప్రాణము ఆది 9 6 నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.
పేరు ఆది 11 4 మరియు వారు- మనము భూమియందంతట చెదిరిపోకుండ ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా
దమస్కు ఆది 14 15 రాత్రివేళ అతడును అతని దాసులును వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమతట్టున్న హోబా మట్టుకు తరిమి
మెల్కీసెదెకు ఆది 14 18 మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసికొనివచ్చెను.  అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు.
మెల్కీసెదెకు ఆది 14 18 అప్పుడతడు అబ్రామును అశీర్వదించి - ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము అశీర్వదింపబడును గాక అనియు, 
మెల్కీసెదెకు ఆది 14 18 నీ శత్రువులను నీ చేతి కప్పగించిన సర్వొన్నతుడు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి పదియవంతు ఇచ్చెను.
విశ్వాసము ఆది 15 5 మరియు ఆయన వెలుపలికి అతని తీసుకొనివచ్చి - నీవు ఆకాశము వైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి- నీ సంతానము ఆలాగవునని చెప్పెను.
నీతిమంతులు ఆది 15 6 అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.
ఇష్మాయేలు ఆది 16 10 మరియు యెహోవా దూత - నీ సంతానమును నిశ్చయమగా విస్తరింపజేసెదను;  అది లెక్కలేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను.
ఇష్మాయేలు ఆది 16 11 మరియు యెహోవా దూత - ఇదిగో యెహోవా నీ మొరను వినెను. నీవు గర్భవతివైయున్నావు; నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు;.
ఇష్మాయేలు ఆది 16 12 అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు.  అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును.
అబ్రాహాము ఆది 17 5 మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు; నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అనబడును.
సున్నతి ఆది 17 10 నాకును నీకును నీ తరువాత సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిభంధన యేదనగా - మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను.
సున్నతి ఆది 17 11 మీరు మీ గోప్యాంగచర్మమున సున్నతి పొందవలెను.  అది నాకు నీకు మధ్యనున్న నిభంధనకు సూచనగా ఉండును.
శారా ఆది 17 15 మరియు దేవుడు- నీ భార్యయైన శారయి పేరు శారయి అనవద్దు;  ఏలయనగా ఆమె పేరు శారా.
సున్నతి ఆది 17 26 ఒక్క దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇష్మాయేలు సున్నతి పొందిరి.
ప్రవర్తన ఆది 18 27 అందుకు అబ్రాహాము- ఇదిగో ధూళియు బూడిదెయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను.
మోయాబీయులు ఆది 19 37 వారిలో పెద్దది కుమారుని కని వారికి మోయాబను పేరు పెట్టెను.  అతను నేటివరకు మోయాబీయులకు మూలపురుషుడుగా ఎంచబడును.
అమ్మోనీయలు ఆది 19 38 చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అను పేరు పెట్టెను.  అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూలపురుషుడుగా ఎంచబడును.
విశ్వాసము ఆది 22 8 అబ్రాహాము - నా కుమారుడా, దేవుడే దహనబలికి గొఱ్ఱెపిల్లను చూచుకొనునని చెప్పెను.
వినుట ఆది 22 18 మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదింపబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను.
ప్రదానము ఆది 23 10 అతడు తన యజమానుని ఒంటెలలో పది ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్ఠమైన నానా విధములగు వస్తువులను తీసికొనిపోయెను.
సహనము ఆది 23 14 కాబట్టి - నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా -నీవు త్రాగుము నీ ఒంటెలకును నీళ్ళు పెట్టెదనని యే చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదైయుండును గాక, అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలిసికొందుననెను.
సహనము ఆది 24 19 మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత - నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికిని నీళ్ళు చేదిపోయుదునని చెప్పి
సహనము ఆది 24 20 త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు  ఆ బావికి పరుగెత్తికొని పోయి అతని ఒంటెలన్నిటికి నీళ్ళు చేది పోసెను.
ప్రదానము ఆది 24 22 ఒంటెలు త్రాగుటయైన తరువాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని, ఆమె చేతులకు పది తులముల ఎత్తుగల రెండు బంగారు కడియములను తీసి
ఆశీర్వాదము ఆది 24 31 యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము; నీవు బయట నిలువనేల ? ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్దము చేయించితిననెను.
బేయెర్షెబా ఆది 26 32 మాకు నీళ్ళు కనబడినవి చెప్పిరి గనుక దానికి షేబ అను పేరు పెట్టెను. కాబట్టి నేటివరకు ఆ ఊరిపేరు బెయేర్షెబా
పరలోకపు గవిని ఆది 28 17 భయపడి-ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు; పరలోకపు గవిని ఇదే అనుకొనెను.
విగ్రహారాధన ఆది 28 18 తెల్లవారినపుడు యాకోబు లేచి తాను తలగడగా చేసికొనిన రాయితీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను. 
బేతెలు ఆది 28 19 మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను ( దేవుని మందిరము) పేరు పెట్టెను.
విగ్రహారాధన ఆది 28 22 మరియు స్తంభముగా నేను నిలిపిన యీ రాయి దేవుని మందిరమగును; మరియు నీవు నాకిచ్చు యావత్తులో పదియవంతు నిశ్చయముగా నీకు చెల్లించెదను.
లేవి ఆది 29 34 ఆమె (లేయా) మరల గర్భవతియై (మూడవ )కుమారుని కని - తుదకు ఈ సారి నా పెనిమిటి నాతో హత్తుకొని యుండును; అతనికి ముగ్గురు కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను.
యూదా ఆది 29 35 ఆమె (లేయా) మరల గర్భవతియై (నాల్గవ )కుమారుని కని - ఈ సారి యెహోవాను స్తుతించెద ననుకొని యూదా అను పేరు పెట్టెను.
కన్యాశుల్కము ఆది 31 15 అతడు మమ్మును అమ్మివేసి, మాకు రావలసిన ద్రవ్యమును బొత్తుగా తినివేసెను.
దొంగతనము ఆది 31 19 లాబాను తన గొఱ్ఱెలబొచ్చు కత్తిరించుటకు వెళ్ళియుండగా రాహేలు తన తండ్రి యింటనున్న గృహదేవతలను దొంగిలెను.
ఇశ్రాయేలు ఆది 32 28 అప్పుడు ఆయన- నీవు దేవునితోను మనుష్యలతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే( దేవునితో పోరాడువాడు) గాని యాకోబు అనబడదని చెప్పెను.
కన్యాశుల్కము ఆది 34 12 ఓలియు కట్నమును ఎంతైనను అడుగుడి; మీరు ఆ చిన్నదాని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోను ఆమె సహోదరులతోను చెప్పెను.
బెన్యామీను ఆది 35 18 ఆమె (రాహేలు) మృతిబొందెను; ప్రాణము పోవుచుండగా ఆమె- అతని పేరు బెనోని (దుఃఖ పుత్రుడు) అనెను; అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను.
రూబేను ఆది 35 22 ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నపుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్నియైన బిల్హాతో శయనించెను; ఆ సంగతి ఇశ్రాయేలుకు వినబడెను.
కలలు ఆది 40 8 అందుకు వారు- మేము కలలు కంటిమి; వాటి భావము చెప్పగలవారెవరును లేరని అతనితో ననగా యోసేపు వారిని చూచి -భావములు చెప్పుట దేవుని అధీనమే గదా; మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడనెను.
మనష్షే ఆది 41 51 అప్పుడు యోసేపు - దేవుడు నా సమస్త భాధను నా తండ్రి యింటి వారినందరిని నేను మరచి పోవునట్లు చేసెనని చెప్పి తన జేష్ఠకుమారునికి మనష్షే అను పేరు పెట్టెను.
ఎఫ్రాయిము ఆది 41 52 తరువాత అతడు - నాకు భాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృధ్ది పొందించెనని చెప్పి, రెండవ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను.
యూదా ఆది 49 9 యూదా కొదమ సింహము. నా కుమారుడా, నీవు పట్టినదాని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడు సింహము వలెను పండుకొనెను.  అతని లేపువాడెవడు?
విశ్రాంతి ఆది 49 33 యాకోబు తన కుమారుల కాజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనులయొద్దకు చేర్చబడెను.
విశ్వాసము ఆది 50 25 మరియు యోసేపు - దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును; అప్పుడు మీరు నా యెముకలను ఇక్కడినుండి తీసికొనిపోవలనని చెప్పి ఇశ్రాయేలు కుమారులచేత ప్రమాణము చేయించుకొనెను.